BREAKING
thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం
Date of Publish : 03 October 2026, 02:11 pm
Posted by : KETHAVATH NITHIN

జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం

తెలంగాణ
/ తెలంగాణ / తెలంగాణ / తెలంగాణ
Reporter
Kethavath Nithin NARSINGI MANDAL
03 Oct, 2026 - 02:11 PM
40 వీక్షణలు

మనోహరాబాద్: మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో వారు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్, కో-కన్వీనర్ పరుం నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేస్తూ ప్రజలకు ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. వారి సేవలను గుర్తించి సన్మానించడం అభినందనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమ కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్, కో-కన్వీనర్ పరుం నరేష్ మాట్లాడుతూ.. సమాజ సేవలో ముందుండే వారిని గుర్తించి ప్రోత్సహించడమే ‘సేవా సంకల్ప అభియాన్’ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.