BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 07:39 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

అవినీతి, అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం రండి: బీఆర్ఎస్ నాయకులకు మంత్రి అడ్లూరి సవాల్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
03 Sep, 2026 - 07:39 PM
5 వీక్షణలు

ధర్మపురి:

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేటీఆర్, హరీష్ రావులకు నేరుగా సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై అలాగే బీఆర్ఎస్ చేస్తున్న అవినీతి ఆరోపణలపై వచ్చే శాసనసభ (అసెంబ్లీ) సమావేశాల్లో సమగ్ర చర్చకు సిద్ధంగా ఉండాలని, ధైర్యముంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా సభకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.  

​జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.  

​ప్రజాపాలనకు ఓర్వలేకనే తప్పుడు ప్రచారాలు:

2023 డిసెంబర్ లో తెలంగాణ ప్రజలు మార్పును కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తెలంగాణ భాష, యాసల పేరిట తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడడం కేటీఆర్, హరీష్ రావుల అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.  

​హామీల అమలుపై స్పష్టత:

పదేళ్ల టీఆర్ఎస్/బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులకు ప్రస్తుత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వడ్డీలు చెల్లిస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోందని తెలిపారు. 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 4 గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, మిగిలిన రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందన్నారు.  

​అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీతో పాటు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి (119 నియోజకవర్గాల్లో) 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు.

​ప్రోగ్రెస్ రిపోర్ట్ సవాల్:

బీఆర్ఎస్ నేతలు ఉనికి కాపాడుకోవడానికే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాపాలన 1,000 రోజుల ప్రగతి నివేదికను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు స్వయంగా పంపిస్తానని, ఆ రిపోర్టులో ఒక్క తప్పు ఉన్నా దేనికైనా సిద్ధమని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.