BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 27 July 2026, 08:30 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. పీడీయాక్ట్ కింద అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 08:30 AM
101 వీక్షణలు

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. అక్రమంగా బియ్యం సేకరించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న వారిపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తోంది.

ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన బచ్చు రత్నాకర్‌పై పోలీసులు పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రత్నాకర్ గతంలో కూడా బియ్యం అక్రమ రవాణా కేసుల్లో ఆరుసార్లు పోలీసులకు చిక్కినప్పటికీ తన కార్యకలాపాలు కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు.

రేషన్ లబ్ధిదారులు, డీలర్ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి వడ్డేపల్లి రైస్ మిల్లులో నిల్వ ఉంచి, అనంతరం బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

తరచూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నేపథ్యంలో అతనిపై పీడీయాక్ట్ అమలు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.