బియ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు: తుమ్మల
తెలంగాణ
/
హైదరాబాద్
బియ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు: తుమ్మల
Telangana: ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని విక్రయిస్తే రేషన్ కార్డు తొలగిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. పార్టీలతో సంబంధం లేకుండా పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని అధికారులు, సర్పంచ్లను ఆదేశించారు. లేదంటే సర్పంచ్ పదవి పోతుందని చెప్పారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ఖమ్మం సభలో హామీ ఇచ్చారు. నీళ్లు లేకపోయినా బతికే పంట పామాయిల్ సాగు చేస్తే ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని తెలిపారు.