తొర్రూరులో బీఆర్‌ఎస్ భారీ బైక్ ర్యాలీ
వెయ్యి బైకులతో కదం తొక్కిన పార్టీ శ్రేణులు.. యువతతో కలిసి సందడి చేసిన ఎర్రబెల్లి
తొర్రూరు | Ntoday News
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి పాలకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సుమారు 1,000 బైకులతో బీఆర్‌ఎస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొనడంతో తొర్రూరు పట్టణంలో సందడి నెలకొంది. పార్టీ జెండాలతో బైకులపై యువత ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వయంగా బైక్ నడుపుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం యువకులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ర్యాలీ ఘనంగా సాగింది. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారుల్లో బీఆర్‌ఎస్ శ్రేణుల సందడి కనిపించింది.