BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 04:19 pm
Posted by : BOYA SWAMY

నకిరేకల్‌లో ఘనంగా వెయ్యి రోజుల ప్రజా పాలన వికాస సభ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
05 Sep, 2026 - 04:19 PM
21 వీక్షణలు

సీఎం రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు

నకిరేకల్ | Ntoday News

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలో నిర్వహించిన వెయ్యి రోజుల ప్రజా పాలన వికాస సభకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం విచ్చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

ప్రజా పాలన, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న తీరుపై కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు చర్చించారు. ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం, ఉప్పర్ సర్పంచ్ ఉయ్యాల నరేష్, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు పల్లపు బుద్ధుడు, చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పొలగొని స్వామి, ఉరుమడ్ల గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, వెలిమినేటి హరిప్రసాద్‌రెడ్డి, 6వ వార్డు సభ్యులు మేడబోయిన స్వాతి శ్రీను, గంగపురం రాము, అనంతుల శంకరయ్య, పాకాల దినేష్, ఉయ్యాల లింగయ్య, 4వ వార్డు సభ్యులు జన్నపాల శీను తదితర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అలాగే గ్రామ ప్రజలు, యువకులు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రజలతో కలిసి.. ప్రజల కోసం.. అభివృద్ధి వైపు మరో అడుగు! అంటూ కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు.