BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 04 October 2026, 07:58 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అక్టోబర్ 5న తెలంగాణలో బార్ అండ్ రెస్టారెంట్ల బంద్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
04 Oct, 2026 - 07:58 PM
10 వీక్షణలు

ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ డిమాండ్

హైదరాబాద్: బార్ల నిర్వహణ, లైసెన్స్ నిబంధనలు, ఫీజుల పెంపునకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా అక్టోబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లను బంద్ చేయాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ పిలుపునిచ్చింది.

ప్రివిలేజ్ ఫీజు, బార్ స్లాబ్‌ను 8 శాతం నుంచి 20 శాతానికి పెంచడంతో పాటు లైసెన్స్ ఫీజును రూ.40 లక్షల నుంచి రూ.44 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని అసోసియేషన్ తెలిపింది. ఈ నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎక్సైజ్ కమిషనరేట్‌ను ముట్టడిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. ఫీజుల పెంపుతో బార్ అండ్ రెస్టారెంట్ రంగంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పేర్కొంది.

ఒక్కో బార్‌పై సుమారు 60 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రభుత్వ తాజా నిర్ణయాల వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల పెంపు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.