అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్.. 22ఏపై చర్చకు అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆరోపణ
హైదరాబాద్ | Ntoday News
తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అన్ని రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ తీర్మానం ఆమోదించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు సంబంధించిన తీర్మానాన్ని మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టగా, స్పీకర్ ఆ తీర్మానాన్ని ఆమోదించి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా.. 22ఏ వంటి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని విమర్శించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ.. ఇది ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా గొంతు నొక్కే ప్రయత్నమని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.