BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 03:23 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పంజాబ్‌ AAP ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
09 Sep, 2026 - 03:23 PM
6 వీక్షణలు

ప్రశ్నించే వారిని భయపెట్టి వేధిస్తున్నారని ఆరోపణ.. మంత్రి రాజీనామాకు డిమాండ్

న్యూఢిల్లీ | Ntoday News

పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని భయపెట్టి, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

డ్రగ్స్ అంశంపై పంజాబ్ మంత్రి హర్‌పాల్ సింగ్ చీమాను ప్రశ్నించిన గుల్జార్ సింగ్ అనే వ్యక్తిపై ఒత్తిడి తీసుకువచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మంత్రి హర్‌పాల్ సింగ్ చీమా వెంటనే రాజీనామా చేయాలని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను రాహుల్ గాంధీ కోరారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కు అని పేర్కొన్న రాహుల్ గాంధీ.. విమర్శించే గొంతులను అణచివేయడం సరికాదని అన్నారు. అయితే గుల్జార్ సింగ్ ఘటనకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై అధికారిక దర్యాప్తు వివరాలు వెలువడాల్సి ఉంది.