BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 03:25 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పీడీ లేక నిలిచిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
09 Sep, 2026 - 03:25 PM
6 వీక్షణలు

వరంగల్ జిల్లాలో 300 మందికిపైగా లబ్ధిదారులకు ఎదురుచూపులు

వరంగల్ | Ntoday News

వరంగల్ జిల్లాలో జిల్లా హౌసింగ్ పీడీ లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం బిల్లుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో ఇళ్లు మంజూరై, వివిధ దశల్లో నిర్మాణ పనులు చేపట్టిన 300 మందికిపైగా లబ్ధిదారులకు బిల్లుల అప్రూవల్ కావడం లేదని పేర్కొన్నారు.

గ్రామ, వార్డు స్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలించి ఆమోదం తెలిపినప్పటికీ.. జిల్లా స్థాయిలో హౌసింగ్ పీడీ లాగిన్‌లో అప్రూవల్ కాకపోవడంతో బిల్లుల చెల్లింపులు ముందుకు సాగడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.

ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సకాలంలో అందకపోవడంతో నిర్మాణ పనులను కొనసాగించడం కష్టంగా మారిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వెంటనే జిల్లా హౌసింగ్ పీడీని నియమించి, పెండింగ్‌లో ఉన్న బిల్లులకు అప్రూవల్ ఇచ్చి చెల్లింపులు చేపట్టాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.