బెంగళూరులో భారత్–జపాన్ 7వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం
వృక్ష సంపద పెంపు, అటవీ జన్యు వనరుల పరిరక్షణపై కీలక చర్చలు
బెంగళూరు | Ntoday News
అడవుల పరిరక్షణ, అభివృద్ధి అంశాలపై భారత్–జపాన్ మధ్య 7వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం బెంగళూరులో నిర్వహించారు. ఇరు దేశాల అటవీ రంగానికి చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు.
కేంద్ర అటవీ శాఖ, జపాన్ అటవీ ఏజెన్సీ ప్రతినిధుల నేతృత్వంలో జరిగిన సమావేశంలో వృక్ష సంపదను పెంపొందించడం, అటవీ జన్యు వనరులను పరిరక్షించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
అటవీ వనరుల సుస్థిర నిర్వహణ, అడవుల సంరక్షణకు ఆధునిక విధానాలు, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్లు తెలిపారు.
భారత్–జపాన్ మధ్య అటవీ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, అనుభవాల పరస్పర మార్పిడికి ఈ సమావేశం దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.