BREAKING
thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో
Date of Publish : 02 August 2026, 05:05 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
02 Aug, 2026 - 05:05 PM
169 వీక్షణలు

భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఎసీసీ క్వారీ బ్రిడ్జి మరియు రాళ్లవాగు బ్రిడ్జిని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంతెనల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో నష్టం వివరాలను తెలుసుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వంతెనలను అత్యవసర ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు, శాశ్వత మరమ్మతులను కూడా త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, సంబంధిత శాఖల అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు