BREAKING
thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో
Date of Publish : 16 September 2026, 10:03 pm
Posted by : DAVU RAVINDER REDDY

ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాలు చేసేవారికి షాక్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
16 Sep, 2026 - 10:03 PM
1 వీక్షణలు

ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి నో.. నెక్లెస్‌ రోడ్‌ వైపే ఏర్పాట్లు

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో GHMC, పోలీసుల చర్యలు.. ట్యాంక్‌బండ్‌పై హెచ్చరిక బోర్డులు

హైదరాబాద్ | Ntoday News

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం అంటే ట్యాంక్‌బండ్‌ గుర్తుకు వస్తుంది. అయితే ఈసారి ట్యాంక్‌బండ్‌పై గణేశ్‌ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ GHMC, హైదరాబాద్‌ పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

ట్యాంక్‌బండ్‌ వైపు విగ్రహాలను తీసుకురాకుండా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనాల కోసం నెక్లెస్‌ రోడ్‌ వైపు అదనపు ప్లాట్‌ఫారాలు, క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన బోర్డులను చూసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్న పలువురు గణేశ్‌ ఉత్సవ కమిటీల నిర్వాహకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ట్యాంక్‌బండ్‌కు బదులుగా GHMC ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలు, బేబీ పాండ్లను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. 

కాగా, సెప్టెంబర్‌ 25న అనంత చతుర్దశి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రధాన నిమజ్జన కార్యక్రమం జరగనుంది. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా అధికారులు ఇప్పటికే మార్గాలు, భద్రతా చర్యలను పరిశీలిస్తున్నారు.