పుంగనూరులో భారీ వర్షానికి కూలిన పిట్టగోడ.. ద్విచక్ర వాహనం ధ్వంసం
మదనపల్లి రోడ్డులో ఘటన.. షాపు యజమాని లోపల ఉండటంతో తప్పిన ప్రమాదం
అన్నమయ్య జిల్లా | పుంగనూరు | Ntoday News
పుంగనూరులో భారీ వర్షం కారణంగా ఓ దుకాణం పిట్టగోడ, మోల్డింగ్ ప్లేట్ ఒక్కసారిగా కూలిపోయాయి. మదనపల్లి రోడ్డులోని జహీర్ చికెన్ షాప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
పిట్టగోడ కూలడంతో అక్కడ నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. దీంతో జహీర్ చికెన్ షాప్‌తో పాటు సమీపంలోని టూ వీలర్ షాప్ నిర్వాహకులకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.
వర్షం సమయంలో షాపు యజమాని దుకాణం లోపల ఉండటంతో పిట్టగోడ కూలిన ఘటనలో ప్రాణాపాయం తప్పింది. ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ద్విచక్ర వాహనం, దుకాణానికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం పరిశీలించి తమను ఆదుకోవాలని షాప్ యజమానులు దాదాపీర్, భావజాన్ కోరుతున్నారు.
కాగా, పుంగనూరు ప్రాంతంలో సెప్టెంబర్ 16న వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తాజా వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.