BREAKING
thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు
Date of Publish : 16 September 2026, 07:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జలంధర్‌లో సెప్టెంబర్ 20, 21న అఖిల భారత కిసాన్ మహాసభలు డి హరినాథ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Sep, 2026 - 07:38 PM
6 వీక్షణలు

విసన్నపేట: అఖిల భారత కిసాన్ మహాసభ 5వ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో సెప్టెంబర్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్నట్లు అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మహాసభల వివరాలను వెల్లడించారు.

ఈ జాతీయ మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య, జెన్ జీ ఉద్యమ నేత, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా బోరా హాజరవుతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కిసాన్ మహాసభ ప్రతినిధులు జలంధర్ మహాసభలకు హాజరుకానున్నట్లు చెప్పారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా రైతులు ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని హరినాథ్ తెలిపారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులకు సీ2 + 50 శాతం ఆధారంగా కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, రైతుల రుణభారం నుంచి విముక్తి కల్పించేందుకు రుణ విమోచన చట్టం తీసుకురావాలని కోరారు.

బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని, బహుళజాతి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంటున్న 2025 విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నూతన విద్యుత్ చట్టం–2025ను రద్దు చేసి రైతులకు ఉచిత విద్యుత్ అందించాలని కోరారు.

కౌలుదారులందరికీ భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, పంటల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని హరినాథ్ కోరారు. అన్ని పంటలకు పంటల బీమా వర్తింపజేసి, బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని కోరారు.

పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సత్వరం పూర్తి చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తక్షణమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి, కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అక్టోబర్ 3 నుంచి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు హరినాథ్ తెలిపారు. నవంబర్ 26 నుంచి దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో నిరవధిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.