BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 19 July 2026, 05:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భయంకరంగా ఏనుగుల స్వైరవిహారం.. రూ.లక్షల్లో రైతులకు పంట నష్టం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 05:21 PM
107 వీక్షణలు

భయంకరంగా ఏనుగుల స్వైరవిహారం.. రూ.లక్షల్లో రైతులకు పంట నష్టం

అన్నమయ్య జిల్లా, జూలై 19: అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం జిల్లేళ్లమంద సమీప అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు స్వైరవిహారం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగైదు రోజులుగా సంచరిస్తున్న గజరాజులు శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న మామిడి, కొబ్బరి, అరటి తోటలపై దాడి చేసి భారీ నష్టం కలిగించాయి.

ఏనుగులు మామిడి, కొబ్బరి చెట్లను నేలమట్టం చేయడంతో పాటు సాగునీటి పైపులు, కంచెలు, రాతి కూసాలను ధ్వంసం చేశాయి. దీంతో జిల్లేళ్లమంద గ్రామానికి చెందిన సుమారు 20 మంది రైతులు రూ.లక్షల్లో నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నామని రైతులు తెలిపారు. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఏనుగుల బెడదను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.