BREAKING
thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు
Date of Publish : 17 September 2026, 10:28 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

తోటగూడెం ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలి: బీజేపీ డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
17 Sep, 2026 - 10:28 PM
1 వీక్షణలు

లక్షెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని తోటగూడెం ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పాఠశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా బీజేపీ గ్రామ కమిటీ నాయకులు మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రహరీ గోడ నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని కోరారు. ప్రహరీ గోడ లేకపోవడం వల్ల విద్యార్థులకు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు, గ్రామ పాలకమండలి వెంటనే స్పందించి ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణ పనులకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, భవిష్యత్తులో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత గ్రామ పాలకమండలి నాయకులు, నిర్మాణాన్ని అడ్డుకునే వ్యక్తులే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీజేపీ నాయకులు హెచ్చరించారు.

విద్యార్థుల భద్రత, పాఠశాల అభివృద్ధి కోసం తోటగూడెం ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తామని వారు తెలిపారు.