మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు
ఆంధ్రప్రదేశ్
/
పోలవరం
చింతూరు, NTODAY న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా సెప్టెంబర్ 17న ‘ఆశ్వీద దీపం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ చింతూరు మండల అధ్యక్షుడు బట్ట లక్ష్మణ్ రాజు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ పోలవరం జిల్లాలోని ప్రతి మండలంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఇంట్లో, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో దీపాలు వెలిగించి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అలాగే మండల కేంద్రాల్లోని ప్రముఖ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగిస్తూ కార్యక్రమాలను నిర్వహించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
‘ఆశ్వీద దీపం’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యక్రమ వివరాలను కార్యకర్తలకు తెలియజేసినట్లు బట్ట లక్ష్మణ్ రాజు తెలిపారు. ప్రజా సేవకు అంకితమైన కార్యక్రమంగా దీనిని నిర్వహించాలని ఆయన కోరారు.