ఘనంగా పోలవరంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
ఏలూరు జిల్లా: నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు చాగంటి వాసుదేవరావు సహకారం అందించారు.
ఈ సందర్భంగా మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు తిరువీధుల రాజేంద్రప్రసాద్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు, చాట్రాయి మండల పార్టీ అధ్యక్షుడు ఓబిళ్ళనేని ఉదయ రాజేశ్వరరావు, జనసేన నాయకుడు సవరం రామారావు, బీజేపీ సీనియర్ నాయకుడు గడ్డం సంజీవరెడ్డి, ఏలూరు జిల్లా సోషల్ మీడియా ఎస్సీ మోర్చా కన్వీనర్ తగరం రాజ్ కుమార్, ఎస్సీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి బాబ్జి, అక్కిరాజు వీర రాఘవ రాజు, ఇజ్జిగాని మురళి, పోలనాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.