BREAKING
thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు
Date of Publish : 17 September 2026, 10:41 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో జనసేన కీలక సమావేశం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Sep, 2026 - 10:41 PM
1 వీక్షణలు

పుంగనూరులో జనసేన కీలక సమావేశం.. స్థానిక ఎన్నికలు, కూటమి సమన్వయంపై చర్చ

పుంగనూరు / అన్నమయ్య జిల్లా: పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

సమావేశంలో పార్టీలో ప్రస్తుత పరిస్థితులు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణుల సన్నద్ధత, కూటమి పార్టీలతో సమన్వయం వంటి అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అలాగే జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, జనసైనికులకు ప్రాధాన్యత కల్పించే అంశంపైనా చర్చించారు. స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాల్సిన అంశాలపై నాయకులు అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు.

సమావేశానికి జిల్లా కార్యదర్శి జావిద్ భాష, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ ఆవుల చైతన్య, పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, రూరల్ అధ్యక్షుడు విరూపాక్ష, చౌడేపల్లి మండల నాయకులు చరణ్ రాయల్, మురళి, కాలేషా, సోమల మండల అధ్యక్షుడు నాగభూషణ్, సదుం మండల నాయకులు శ్రీకాంత్, ఆనంద్, రొంపిచర్ల మండల అధ్యక్షుడు రెడ్డి శేఖర్‌తో పాటు పలువురు నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

సమావేశాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) ధన్యవాదాలు తెలిపారు.