BREAKING
thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు
Date of Publish : 17 September 2026, 10:36 pm
Posted by : PAMMI NAVEENKUMAR

రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
17 Sep, 2026 - 10:36 PM
1 వీక్షణలు

అమలాపురం: రావులపాలెంలో పనీర్ నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పనీర్ తిన్న అమలాపురానికి చెందిన ఓ కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొంటూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందినట్లు సమాచారం. దీనిపై స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో అమలాపురం, రావులపాలెం ప్రాంతాల్లోని ఐదు మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయా దుకాణాల్లో విక్రయిస్తున్న పాల ఉత్పత్తులు, ముఖ్యంగా పనీర్ నాణ్యతను పరిశీలించారు.

తనిఖీల్లో భాగంగా పనీర్ నమూనాలను అధికారులు సేకరించారు. సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షల కోసం మద్రాస్‌లోని ల్యాబొరేటరీకి పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగశాల నివేదికలు వచ్చిన తర్వాత పనీర్ నాణ్యతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పనీర్ తయారీ, విక్రయాల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై అధికారులు పరిశీలన చేపట్టారు. ల్యాబొరేటరీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.