సింగరేణి సత్తుపల్లి ఏరియాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
సత్తుపల్లి, NTODAY న్యూస్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ సత్తుపల్లి ఏరియాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సత్తుపల్లి స్పెషల్ ఏరియా జనరల్ మేనేజర్ ఎస్. వెంకటాచారి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం జనరల్ మేనేజర్ ఎస్. వెంకటాచారి మాట్లాడుతూ ప్రజాపాలన దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి సమష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సెక్యూరిటీ సిబ్బంది జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన దినోత్సవ ప్రాధాన్యతను వివరించడంతో పాటు సంస్థ పురోగతికి ఉద్యోగుల పాత్రపై కార్యక్రమంలో చర్చించారు.
వేడుకలకు ఎస్‌ఓటుజీఎం బొల్లం శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్. సుధాకర్, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ బి. కోటేశ్వరరావు, సీఎంఓఏఐ సత్తుపల్లి ఏరియా అధ్యక్షుడు ఏఎల్‌ఎస్‌వీ సునీల్ వర్మ, సత్తుపల్లి ఏరియా ఇంజినీర్, పర్చేజ్ ఆఫీసర్, వివిధ గనులు, విభాగాల హెచ్‌ఓడీలు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.