భారతికి పీహెచ్‌డీ పట్టా ప్రదానం
ఆంధ్రప్రదేశ్
కుప్పం, NTODAY న్యూస్: ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలోని తమిళ భాష, అనువాద అధ్యయనాల విభాగం పరిశోధక విద్యార్థిని భారతికి పీహెచ్‌డీ పట్టా లభించింది. ప్రొఫెసర్ సుబ్బు రెడ్డియార్ జీవిత చరిత్రలోని సామాజిక, సాంస్కృతిక సందేశాలపై ఆమె చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు.
విభాగాధిపతి డాక్టర్ పి.ఎస్. గణేష్ మూర్తి పర్యవేక్షణలో భారతి తన పరిశోధనను పూర్తి చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. పరిశోధనలో భాగంగా సుబ్బు రెడ్డియార్ జీవిత చరిత్రలో ప్రతిబింబించిన సామాజిక, సాంస్కృతిక అంశాలను ఆమె విశ్లేషించినట్లు పేర్కొన్నారు.
పీహెచ్‌డీ పట్టా పొందిన భారతిని ద్రావిడ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, సిబ్బంది అభినందించారు. ఆమె భవిష్యత్‌లో మరిన్ని పరిశోధనలు కొనసాగించాలని ఆకాంక్షించారు.