BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ సిబ్బందికి రెండవ రోజు శిక్షణ. పోషణ, విద్యతో చిన్నారుల సమగ్ర అభివృద్ధిపై అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 08:32 PM
20 వీక్షణలు

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి నిర్వహిస్తున్న ‘పోషణ్ భీ పఢాయీ భీ’ రెండో విడత శిక్షణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ శిక్షణలో చిన్నారుల పోషణ, ఆరోగ్యం, విద్య, మానసిక వికాసానికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ పర్యవేక్షకురాలు గాయత్రీ దేవి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నారుల జీవితంలో తొలి ఆరు సంవత్సరాలు అత్యంత కీలకమైనవని, ఈ దశలోనే వారి శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. శిక్షణలో భాగంగా 0 నుంచి 3 సంవత్సరాల పిల్లల అభివృద్ధి మైలురాళ్లు, నవచేతన కార్యక్రమం, ఈసీసీఈ దినోత్సవం, పిల్లల్లో వైకల్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించే విధానం, 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారుల విద్యాభివృద్ధికి సంబంధించిన ఆధార్‌శిల కార్యక్రమం, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆరోగ్య సూచికలు తదితర అంశాలపై వివరంగా శిక్షణ అందించారు. చిన్నారుల్లో పోషకాహార లోపాలను గుర్తించడం, వయస్సుకు తగిన ఎదుగుదలను పరిశీలించడం, ఆటపాటల ద్వారా విద్యాబోధన చేయడం, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి తగిన సహాయం అందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో సమర్థవంతంగా అమలు చేసి చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.