BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 02:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 02:53 PM
165 వీక్షణలు

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో డిపిఆర్టియు మండల శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో డిపిఆర్టియు నాయకులు ఆర్. నాగేశ్వరరావు, చంద్రకళ మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థుల్లో భాషపై మక్కువ పెంచేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అదేవిధంగా విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిపిఆర్టియు నాయకులు సత్తెనపల్లి రాము, మండల అధ్యక్షుడు బి.సీహెచ్. రాంబాబు, ప్రధాన కార్యదర్శి తేరా రామారావు, పి. తిరుపతయ్య, ఈఎస్ రంగారావు, సీహెచ్ శ్రీను, బి. రాందాస్, బి. శ్రీను, చంద్రకళ, బి. గణేష్, ఎల్. భార్గవ్, ఏ. క్రాంతి, పి. మహేష్, ఏ. కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.