BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 03 August 2026, 08:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చేప పిల్లల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.. రూ.116 కోట్లకు ప్రభుత్వం ఆమోదం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:54 PM
48 వీక్షణలు

చేప పిల్లల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.. రూ.116 కోట్లకు ప్రభుత్వం ఆమోదం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చేపలు, రొయ్య పిల్లల కొనుగోలు కోసం రూ.116 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం నిర్ణయంతో టెండర్ల ప్రక్రియ పూర్తైన వెంటనే రాష్ట్రంలోని చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సుమారు 26 వేల చెరువుల్లో 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది.

ఈ చర్యతో చెరువుల్లో చేపల ఉత్పత్తి పెరగడంతో పాటు మత్స్యకారులకు ఉపాధి, ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభించనుంది.

ప్రభుత్వ నిర్ణయంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేపల ఉత్పత్తి పెరిగి తమ జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.