చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి
చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును కోరిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడి: చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.
శనివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం అనంతరం రోషన్ కుమార్ ముఖ్యమంత్రిని కలిసి నిర్వాసిత రైతుల సమస్యలను వివరించారు. గతంలో బీడు భూములతో సమానంగా ఆయిల్‌ఫామ్ తోటలకు కూడా ఒకే ధరను లెక్కించడంతో కొంతమంది రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు నిర్వాసిత రైతుల సమస్యలు, నష్టపరిహారం అంశాలను వివరిస్తూ రోషన్ కుమార్ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
ముఖ్యమైన పదాల పునరుక్తిని తగ్గించండి
రైతుల సమస్యను మరింత స్పష్టంగా వివరించండి