BREAKING
thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
Date of Publish : 28 March 2026, 06:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి సర్కిల్‌లో జూద శిబిరాలపై పోలీసుల దాడులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Mar, 2026 - 06:00 AM
176 వీక్షణలు

చింతలపూడి సర్కిల్‌లో జూద శిబిరాలపై పోలీసుల దాడులు – 32 మంది అరెస్ట్

ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ పరిధిలో జూదం, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో విస్తృత స్థాయిలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో, వివిధ పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో కోడిపందాలు, పేకాట ఆడుతున్న 32 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ. 30,180 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జూద శిబిరాల వద్ద నిలిపి ఉంచిన 20 మోటార్ సైకిళ్లను సీజ్ చేయగా, పందాలకు సిద్ధం చేసిన 14 కోళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే జూదం, కోడిపందాల వంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. యువతను తప్పుదారి పట్టించే ఇలాంటి చర్యలపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.