BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 03 July 2026, 07:39 pm
Posted by : కూనురు మధు

చిట్యాల నూతన ఎంపీడీవో గా జెల్ల పాండు బాధ్యతల స్వీకరణ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Jul, 2026 - 07:39 PM
537 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండల అభివృద్ధి అధికారిగా జెల్ల పాండు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం, హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయనను చిట్యాల మండలానికి బదిలీ చేయగా, నూతన ఎంపీడీవోగా పదవీ బాధ్యతలు చేపట్టారు.  అనంతరం ఆయన కార్యాలయ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి, మండల అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామపంచాయతీల పరిపాలనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జె. పాండు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.మండల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.