BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 03 July 2026, 08:50 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

జగిత్యాల జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
03 Jul, 2026 - 08:50 PM
213 వీక్షణలు

జగిత్యాల జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

​జగిత్యాల: కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాలోని మూడు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ప్రత్యేకంగా ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో 6వ తరగతి నుండి JEE, NEET, CLAT, EAPCET వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

​ఈ పాఠశాలల్లో అదనపు సౌకర్యాలుగా ఎక్స్‌టర్నల్ టీచర్లు, ఆధునిక లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వ్యక్తిత్వ వికాస తరగతులు, కెరీర్ గైడెన్స్, డిజిటల్ తరగతి గదులు మరియు యోగా వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. ఈ పోటీ పరీక్షలకు అయ్యే ఫీజును కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

​ప్రవేశ పరీక్ష వివరాలు:

జిల్లాలోని 13 కేజీబీవీలలో ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

​దరఖాస్తు గడువు: 05.07.2026

​ప్రవేశ పరీక్ష తేదీ: 12.07.2026

​అర్హత: జిల్లాలోని సంబంధిత కేజీబీవీలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థులు.

​కేజీబీవీలు మరియు అందించే కోచింగ్ వివరాలు:

​కేజీబీవీ జగిత్యాల: NEET, EAPCET

​కేజీబీవీ కోరుట్ల: JEE, EAPCET

​కేజీబీవీ ఇబ్రహీంపట్నం: LAWCET

​ప్రభుత్వం కల్పించిన ఈ సువర్ణావకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మరిన్ని వివరాల కోసం అందుబాటులో ఉన్న కేజీబీవీలను సంప్రదించగలరు.