BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 11 June 2026, 02:44 pm
Posted by : కూనురు మధు

చిట్యాల పిఎస్ ముందు నేరడ రైతులు , మహిళలు ఆందోళన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Jun, 2026 - 02:44 PM
1,025 వీక్షణలు

బ్రాహ్మణ వెల్లంల కాల్వ వివాదంతో ఉద్రిక్తత!

నల్లగొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాదిరెడ్డిపల్లి నుంచి నేరడ గ్రామానికి వెళ్లే దారి విషయంలో తలెత్తిన వివాదం చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తమను అన్యాయంగా స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ నేరడ గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాల మహిళలు, రైతులు చిట్యాల పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్థానికులు తెలిపిన వివరాల  ప్రకారం గాదిరెడ్డిపల్లి నుంచి నేరడ గ్రామానికి వెళ్లే పాత బాట (రైతుల దారి)కి అడ్డంగా అధికారులు బ్రాహ్మణ వెల్లంల కాల్వ నిర్మాణం చేపట్టారు. దీనివల్ల రైతులకు, గ్రామస్థులకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో దీనిపై గ్రామస్థులు ఆందోళన చేయడంతో అక్కడ బ్రిడ్జి నిర్మిస్తామని స్థానిక నాయకులు హామీ ఇచ్చారు. రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాల్వపై తాత్కాలిక దారి ఏర్పాటు కోసం భారీ సిమెంట్ గుణా పైపులను మంజూరు చేయించారు. సదరు సిమెంట్ పైపులు వేసి బాట నిర్మించాల్సింది పోయి, కొందరు స్థానిక నాయకులు వాటిని అమ్ముకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు, విసిగిపోయారు ఇటీవల కొంతమంది వ్యక్తులు కాల్వను పూడ్చివేసారని తెలిపారు. ​కాల్వను పూడ్చివేసి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారనే ఆరోపణలతో చిట్యాల పోలీసులు నేరడ గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ​పోలీసుల తీరుపై నేరడ గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ దొంగతనాలు, నేరాలు చేయలేదని, కేవలం దారి కోసం ఆరాటపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
​ఫిర్యాదుదారుడు ఎవరు ?  అసలు మాపై ఎవరు కంప్లైంట్ ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో పోలీసులు స్పష్టంగా చెప్పాలని మహిళలు భీష్మించుకు కూర్చున్నారు. అలా కూర్చున్న మహిళలను తప్పు ఒప్పుకొని వెళ్లిపోండి అంటూ పోలీసులు సమాధానం చెప్పారని వాపోయారు. కొందరు స్వార్థపరులైన స్థానిక లీడర్ల మాటలు విని, ఏమీ తెలియని అమాయక రైతులను, మహిళలను స్టేషన్‌కు పిలిపించి వేధించడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. నెరద ​గ్రామంలో దారి సమస్యను పరిష్కరించకుండా, పైపులు అమ్ముకున్న లీడర్లను వదిలేసి.. రైతులను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని మహిళలు, రైతులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తక్షణమే స్పందించి, తమకు శాశ్వత దారి సౌకర్యం కల్పించడంతో పాటు, పోలీసుల వేధింపులు లేకుండా చూడాలని నేరడ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.