BREAKING
పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ..
www.ntodaynews.com

నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
11 Jun, 2026 - 02:35 PM
9 వీక్షణలు

NTODAY NEWS:- ఆంధ్రప్రదేశ్ 

•టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి.

• కొందరు స్వార్థపరులు అప్పుల నుంచి బయటపడేందుకు పార్టీని, నాయకుల్ని భ్రష్టుపట్టిస్తున్నారు

• అలాంటి వారు పద్ధతి మార్చుకోకుంటే మూల్యం చెల్లించుకుంటారు

• టీడీపీ విజయం వెనకున్న అదృశ్య శక్తి భాష్యం రామకృష్ణ

• పనితీరు, కష్టంలో చంద్రబాబే నాకు ఆదర్శం :  రామకృష్ణ

• మంచి రాజకీయ లక్షణాలున్న పార్టీ తెలుగుదేశం : రామకృష్ణ

• బీఎల్ఓల అవగాహనా సమావేశంలో ఎంపీ భాష్యం, ఎమ్మెల్యే ప్రత్తిపాటి

• తొలిసారి పెద్దల సభకు ఎన్నికైన భాష్యం రామకృష్ణను తొలి సన్మానంతో ఘనంగా సత్కరించిన ప్రత్తిపాటి, టీడీపీ నాయకులు

టీడీపీ విజయం వెనుక నియోజకవర్గ పార్టీ విభాగాలు, కార్యకర్తలందరి కష్టం ఉందని, డిజిటల్ మహానాడుని సమర్థవంతంగా నిర్వహించి చరిత్ర సృష్టించామని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలో టీడీపీ జెండా తప్ప మరో జెండా ఎగరడానికి వీల్లేదనే, పార్టీ విజయం శాశ్వతం అయ్యేలా గట్టి పట్టుదలతో శ్రేణులు పనిచేయాలన్నారు. సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విధవిధానాలపై ప్రతి కార్యకర్తా అవగాహన పెంచుకోవాలని, ఓటర్ల సమగ్ర సర్వేలో చిన్న తప్పుకు కూడా ఆస్కారం లేకుండా నిబద్ధతతో పనిచేయాలని ప్రత్తిపాటి బీఎల్ఓ లకు పిలుపునిచ్చారు.  

బుధవారం సాయంత్రం స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్ లో  జరిగిన నియోజకవర్గ బీఎల్ఓల అవగాహనా సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ప్రత్యేక అతిథిగా రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి, టీడీపీ నాయకులు తొలుత కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ప్రముఖ విద్యావేత్త భాష్యం రామకృష్ణను ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు ప్రసంగించారు. 

రాజధాని పురోగతిలో కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తోంది...

పార్టీ బలోపేతం కోసం ఎలాంటి మొహమాటాలకు తావులేకుండా పనిచేయని వారిని పక్కన పెట్టడంలో అధినాయకత్వం విధానాన్నే తాను అవలంభిస్తున్నట్టు ప్రత్తిపాటి తేల్చిచెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం బాగా సహకరిస్తోందని, మోదీ నాయకత్వం వల్లే ప్రపంచంలో భారత్ కు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.  అమరావతికి చట్టబద్ధత సహా, నిర్మాణానికి సకాలంలో నిధులు అందించడం, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుతో ప్రజా రాజధాని పురోగతిలో కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి

చంద్రబాబు అందిస్తున్న ప్రజాసంక్షేమంపై గొడ్డలపార్టీ విష ప్రచారాన్ని పార్టీశ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని, సోషల్ మీడియాలో యాక్టివ్ గా వ్యవహరించాలని ప్రత్తిపాటి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 2014-19మధ్య,  ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కొండవీడు అభివృద్ధి, ముస్లిం బాలికల ప్రత్యేక పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, బైపాస్ నిర్మాణం, తాజాగా ఆటోనగర్ ప్రారంభోత్సవం. రోడ్లు, డ్రైన్ల నిర్మాణం సహా గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి సాధించామన్నారు.

అప్పుల నుంచి తప్పించుకోవడానికి పార్టీని, నాయకుల్ని అప్రతిష్ఠ పాలు చేయడమేంటి?

 కొందరు పార్టీ ప్రతిష్ఠ మంటగలపడానికి తమ తప్పులను పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. తన స్వప్రయోజనాలకోసం అప్పులు చేసి, వాటి నుంచి తప్పించుకోవడానికి తనను, లోకేశ్ ను, టీడీపీని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోకుంటే మూల్యం చెల్లించుకుంటారని ప్రత్తిపాటి సభాముఖంగా హెచ్చరించారు.

టీడీపీ విజయం వెనకున్న అదృశ్య శక్తి భాష్యం రామకృష్ణ

కష్టపడి పైకి వచ్చిన అతికొద్ది మంది విద్యావేత్తల్లో భాష్యం రామకృష్ణ ఒకరని,  టీడీపీ తరుపున రాజ్యసభకు ఎన్నికైన తరుణంలో చిలకలూరిపేట టీడీపీ తరుపున ఆయనకు తొలి సన్మానం ఏర్పాటు చేసినట్టు ప్రత్తిపాటి పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో పార్టీ గెలుపుకోసం రామకృష్ణ తీవ్ర కృషిచేశారని, అలానే 2024 ఎన్నికల్లో కూటమి విజయం కోసం అదృశ్య శక్తిగా వ్యవహరించారని ప్రత్తిపాటి తెలిపారు.. అలాంటి నాయకుడిని సన్మానించుకోవడం మనల్ని మనం సన్మానించుకోవడమేనని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.

 కష్టంలో చంద్రబాబే ఆదర్శం : భాష్యం రామకృష్ణ

 పనితీరు, కష్టపడే స్వభావంలో తనకు చంద్రబాబే ఆదర్శమని, ఆయన్నుంచి రోజూ కొత్త విషయాలు నేర్చుకోవచ్చని, లోకేశ్ నాయకత్వాన్ని తాను అమితంగా ఇష్టపడతానని భాష్యం రామకృష్ణ చెప్పారు. చిలకలూరిపేట ప్రజలు తనపై ఎప్పుడూ ఆత్మీయత, అభిమానం చూపుతారని, ప్రత్తిపాటి నాయకత్వ ప్రభావమే అందుకు కారణమై ఉండొచ్చని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రత్తిపాటి చేతల మనిషని, అలాంటి నాయకుడి సమక్షంలో నాకు తొలి సన్మానం జరగడం చెప్పలేని సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మంచి రాజకీయ లక్షణాలున్న తెలుగుదేశం అధికారంలో ఉంటే ప్రజలకు, రాష్ట్రానికి ఎలాంటి లోటు ఉండదన్నారు. చంపుతాం. పొడుస్తాం. రప్పారప్పా నరుకుతామనే వారు ప్రజల్ని, రాష్ట్రాన్ని పరిపాలించడానికి పనికిరారు అని రామకృష్ణ తేల్చిచెప్పారు. 

కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పేర్ని వీరనారాయణ, అబ్జర్వేఆర్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.