BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 11 June 2026, 07:26 am
Posted by : కూనురు మధు

మందగించిన నైరుతి రుతుపవనాలు..

తెలంగాణ
/ హైదరాబాద్
11 Jun, 2026 - 07:26 AM
245 వీక్షణలు

రాబోయే రోజుల్లో పెరగనున్న ఎండలు, ఉక్కపోత

​తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు కొంత మందగించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇవి దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే విస్తరించి నిలిచిపోయాయి. రుతుపవనాల కదలికలు బలహీనపడటంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. రాబోయే రోజుల్లో ఎండలతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ 18 తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చి, కాస్త చల్లబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూన్ 19 నుండి 23 మధ్య తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు మళ్లీ పుంజుకుని, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం  రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది.