BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
09 Jun, 2026 - 08:10 PM
70 వీక్షణలు

చిలకలూరిపేట, జూన్ 9: నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి చిలకలూరిపేట ఆటోనగర్ కీలక కేంద్రంగా మారాలని, రవాణా రంగ కార్మికుల సంక్షేమం మరియు భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

ఈ నెల 11న పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ. భరత్ చేతుల మీదుగా ఆటోనగర్ ప్రారంభోత్సవం, అర్హులైన కార్మికులకు తొలి విడత పట్టాల పంపిణీ, నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మంగళవారం ఆటోనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అర్హులైన కార్మికులకు పట్టాలు అందజేస్తామని తెలిపారు. పట్టాలు పొందిన వారు యూనిట్లు స్థాపించి ఉపాధి అవకాశాలను పెంచాలని సూచించారు. అవసరమైన ఆర్థిక సహాయం కోసం బ్యాంకులు, ప్రభుత్వ విభాగాల సహకారాన్ని వినియోగించుకోవాలని కోరారు.

రవాణా రంగానికి కీలకమైన ఈ ఆటోనగర్ అభివృద్ధితో వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. వాహనాల మరమ్మతు కేంద్రాలు, గ్యారేజీలు, వర్క్‌షాపులు, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పడటం ద్వారా చిలకలూరిపేట ఆటోనగర్ మినీ ఇండస్ట్రియల్ హబ్‌గా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయవాడ, హిందూపురం ఆటోనగర్‌లకు ధీటుగా చిలకలూరిపేట ఆటోనగర్ అభివృద్ధి చెందాలని, కార్మికులు నిబద్ధతతో పనిచేసి ఈ ప్రాంత ప్రగతికి తోడ్పడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.