BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 24 July 2026, 09:02 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయమే బలమైన పునాది: పుంగనూరు మండల కూటమి నాయకులు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 09:02 PM
36 వీక్షణలు

విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయమే బలమైన పునాది: పుంగనూరు మండల కూటమి నాయకులు...

అన్నమయ్య జిల్లా.పుంగనూరు. శుక్రవారం నాడు పుంగనూరు మండలం లోని , పూజగాని పల్లి , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ కార్యక్రమానికి మండల కూటమి నాయకులు మరియు పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు గారు ముఖ్య అతిథిలుగా

హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దే తొలి గురువులు తల్లిదండ్రులు, రెండో గురువులు ఉపాధ్యాయులేనని  అన్నారు. ఈ ఇద్దరూ సమన్వయంతో పనిచేస్తేనే విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రమశిక్షణ, విలువలు, వ్యక్తిత్వ వికాసంలోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన బోధన అందించేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని చదువులో రాణించాలని సూచించారు.

పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి గారు మరియు సి. ఐ సుబ్బారాయుడు గారు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై నిరంతరం పర్యవేక్షణ వహిస్తూ పాఠశాల కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలని, ఉపాధ్యాయులతో తరచూ సంప్రదింపులు జరపాలని కోరారు. విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు.

 పుంగనూరు మండల జనసేన అధ్యక్షుడు విరూపాక్షి గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెల, నెల తన జీతం నుంచి పిఠాపురం లో ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడాన్ని స్పూర్తిగా తీసుకొని ఈ రోజు పూజగానిపల్లి పాఠశాలలో పదోతరగతిలో 500 పైన మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులు కి ఐదు ,ఐదు వేలు రూపాయలు (5000/- ) ప్రైజ్ మనీ గా  ఇవ్వడం జరిగింది . ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని తమ సొంత బిడ్డలా భావించి బోధించాలని, వారి ప్రతిభను వెలికితీసే దిశగా కృషి చేయాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, ప్రతి విద్యార్థి కుటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి గర్వకారణంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, రూరల్ నాయకుడు శివ కుమార్ రెడ్డి, టీడీపీ క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, మండల కూటమి నాయకులు హరి, బాలాజీ నాయక్, పవన్ కుమార్, వెంకటరమణ, జనార్దన రాయల్,రమేష్, వెంకటేష్,రూపేంద్ర నాయక్, రాంబాబు, రేవంత్, సీన, జావేద్, మురళి, కాలేశా, కృష్ణ, రవి కుమార్, మణి నాయక్ ,చంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.