BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

​ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ చికిత్స అందించాలి : పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
10 Jun, 2026 - 09:39 PM
7 వీక్షణలు

NTODAY NEWS:- రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుల ప్రాణాలు కాపాడటమే ప్రథమ కర్తవ్యమని, వారికి ఆసుపత్రులు తక్షణమే నగదు రహిత  చికిత్స అందించేందుకు ముందుకు రావాలని తెలంగాణ డీజీపీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బాధితులకు అందించిన చికిత్సకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వమే తర్వాత చెల్లించేలా త్వరలోనే తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ​బుధవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి అధ్యక్షతన '99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘రోడ్డు భద్రత - ప్రమాదాల నివారణ’ అవగాహన సదస్సులో డీజీపీ ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ​వేగం కన్నా ప్రాణమే మిన్న అని , 

​ఏడాదికేడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడంపై డిజిపి ఆందోళన వ్యక్తం చేశారు. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడమే ప్రధాన కారణాలని ఆయన విశ్లేషించారు. వేగం కన్నా ప్రాణాలు ముఖ్యం అని మనం క్షేమంగా ఇంటికి చేరాలనే లక్ష్యంతోనే వాహనాలు నడపాలి అని హితవు పలికారు. నల్లగొండ జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక చర్యలు, వెలిమినేడు గ్రామంలో కల్పించిన అవగాహన వల్ల ఇక్కడ ప్రమాదాల సంఖ్య సగానికి సగం తగ్గడం అభినందనీయమన్నారు. ​ప్రమాదం జరిగిన మొదటి గంట బాధితుడిని ఆసుపత్రికి చేర్చగలిగితే 80 నుంచి 90 శాతం ప్రాణాలు కాపాడవచ్చని డీజీపీ తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి మానవత్వాన్ని చాటుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం రహబీర్ అవార్డు’ ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఈ అవార్డు కింద బాధితుడిని కాపాడిన వ్యక్తికి రూ. 25,000 నగదు బహుమతితో పాటు ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేస్తారని వివరించారు. అలాగే, రోడ్డు భద్రతా నియమాలను పర్యవేక్షించేందుకు త్వరలోనే ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ను ప్రారంభించనున్నట్లు డీజీపీ ప్రకటించారు.

​అనంతరం నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి సభలో ఉన్న ప్రతి ఒక్కరితో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు.. ​ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని వాహనదారులందరూ విధిగా హెల్మెట్ ధరించేలా ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఒకవేళ ఎవరైనా హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే, గ్రామస్తులు ఎవరైనా సరే వారిని ఫోటో తీసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మాన పత్రాన్ని సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు సభాముఖంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, తహసీల్దార్ విజయ్ కుమార్,  వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.