BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 10 June 2026, 09:34 pm
Posted by : V శ్రీనివాస్

భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు

తెలంగాణ
/ మంచిర్యాల / తాండూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 09:34 PM
243 వీక్షణలు

జిల్లాలోని ప్రజల నుంచి భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం ఆయన జిల్లాలోని తాండూర్, నెన్నెల, మందమర్రి మండలాల తహసిల్దార్ కార్యాలయాలను సందర్శించి, సాదాబైనామా దరఖాస్తులు మరియు భూభారతి పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాట్లాడుతూ, ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చి భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించి విచారణ చేపట్టడం జరుగుతుందని, ఇట్టి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పకడ్బందీగా విచారణ చేపట్టి పరిష్కరణ వేగవంతం చేయాలని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు