BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 10:23 pm
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 Jun, 2026 - 10:23 PM
113 వీక్షణలు

22 మంది అభ్యర్థులు అర్హత సాధింపు

శ్రీశైలం, జూన్ 9: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీరశైవ ఆగమ పాఠశాలలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. చంద్రవతి కల్యాణ మండపంలో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 25 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 22 మంది హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు.

ప్రవేశ పరీక్షకు హాజరైన 22 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కోర్సులో ప్రవేశానికి అర్హత పొందిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలించారు.

వీరశైవ ఆగమ కోర్సు కాలపరిమితి ఆరు సంవత్సరాలు కాగా, విద్యాభ్యాస సమయంలో విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించబడతాయని అధికారులు వెల్లడించారు.

ఈ పరీక్ష నిర్వహణలో ఎం. శివశంకరయ్య స్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, పాఠశాల పర్యవేక్షకులు డి. రంగన్న, వార్డెన్ జి. శ్రీనివాసులు, ఆగమ పండితులు ఎం. శివయ్య, ఆంగ్ల ఉపాధ్యాయులు డి. లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శైవ ఆగమ సంప్రదాయ పరిరక్షణ, అర్చక విద్యాభివృద్ధి లక్ష్యంగా ఈ కోర్సును శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తోంది.