BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 10:22 pm
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 Jun, 2026 - 10:22 PM
113 వీక్షణలు

230 మందికి పైగా యోగసాధకుల పాల్గొనీ 

శ్రీశైలం, జూన్ 9: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న యోగా శిక్షణా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నట్లు వెల్లడించారు.

మంగళవారం చంద్రవతి కల్యాణ మండపంలో నిర్వహించిన యోగా శిక్షణా కార్యక్రమంలో 230 మందికి పైగా యోగసాధకులు పాల్గొని శిక్షణ పొందారు. దేవస్థానం సిబ్బంది, స్థానికులు, శివసేవకులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ, స్థానికులు మరియు యాత్రికులు యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొని యోగా పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. యోగసాధన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అందువల్లే యోగా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిందని పేర్కొన్నారు.

యోగాచార్యుడు గంధవళ్ళ బాలసుబ్రహ్మణ్యం మరియు వారి బృందంలోని యోగా గురువులు సాధకులకు వివిధ యోగా విధానాలపై శిక్షణ అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో ప్రాణాయామం చేయించడంతో పాటు పలు సూక్ష్మ వ్యాయామాలు నిర్వహించారు. అనంతరం వివిధ యోగాసనాలను అభ్యసింపజేశారు.

యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంతో పాటు యోగా సాధనను మరింత విస్తృతంగా ప్రోత్సహించేందుకు శ్రీశైల దేవస్థానం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.