BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 06:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

SIR కార్యక్రమంలో బీఎల్‌ఏలు, BLOలతో సమన్వయంతో పనిచేయాలి మోరంపూడి శ్రీనివాస రావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:33 AM
264 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం: ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో బీఎల్‌ఏలు BLOలతో కలిసి ఖచ్చితత్వంతో ఓటరు జాబితా రూపొందించేందుకు కృషి చేయాలని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు కోరారు.

బుధవారం సాయంత్రం ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, ఆరుగోలనుపేట గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వర రావు అధ్యక్షతన SIRపై అవగాహనా కార్యక్రమం మరియు చాట్రాయి మండలం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో మోరంపూడి శ్రీనివాస రావు మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో BLOలతో పాటు టీడీపీ బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే, నూజివీడు నియోజకవర్గంలో మంత్రి  కొలుసు పార్థ సారథి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి టీడీపీ కుటుంబ సభ్యులు ఐక్యంగా కృషి చేయాలని మోరంపూడి శ్రీనివాస రావు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్న ఆహ్వానాన్ని ఆయన వినిపించారు.

ఈ కార్యక్రమంలో మరిడి వెంకటేశ్వర రావు, బొట్టు రామచంద్ర రావు, అత్తులూరి శ్రీనివాస రావు, మాదాసు చంద్రకళ ప్రసంగించారు. బొట్టు లక్ష్మణ రావు, నోబుల్ రెడ్డి, యర్రా రాజబాబు, ఉయ్యాల దిలీప్ కుమార్, పానుగళ్ళ కోటేశ్వర రావు, మండలంలోని వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇంచార్జ్‌లు, బూత్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.