BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 11 June 2026, 10:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మోడీ పాలనపై సిపిఐ(ఎం ఎల్) లిబరేషన్ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 10:18 AM
181 వీక్షణలు

కేంద్రంలో 12వ సంవత్సరం పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ పాలనను ఘనంగా జరుపుకునే ఎన్డీ ఏ సమ్మేళనానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి రాష్ట్ర రాజకీయాల్లో ఓ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు మేలు చేయడం శూన్యమని సిపిఐ(ఎం ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిహరినాథ్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు వాగ్దానాలు, కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన హామీలు సగం కూడా నెరవేర్చలేదని ఆయన తెలిపారు. మోడీ పాలనలో పబ్లిక్ రంగ సంస్థలు–ఎల్ఐసి, రైల్వే, బిఎస్ఎన్ఎల్, ఎయిర్‌పోర్టులు, ఎఫ్‌సిఐ–విక్రయానికి పెట్టబడడం, అలాగే ఆదానీ, అంబానీలకు అవకాశాలు సమకూర్చడం వల్ల నిరుద్యోగం పెరిగినట్లు విమర్శించారు. రూపాయి విలువ డాలర్‌ లో 96 పైసల వరకు పతనం చెందినందుకు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

చాయ్‌ వాలా పాలనలో పకోడీలు అమ్మే వ్యక్తి కూడా తాను కల్పించిన ఉద్యోగమే అని పేర్కొన్న మోడీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల చిన్న హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని,ఇది ఆయన అభివృద్ధి మానిఫెస్టోకు వ్యతిరేకమే.”అని

అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో మోడీ గిన్నిస్ రికార్డులు సృష్టించారని, ప్రతిపక్షాలపై ఐ టి దాడులు చేసి భయపెట్టడం, లోపరచుకోవడం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం జరుగుతోందని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యంతో నితీష్ కుమార్‌ను కేంద్రానికి పంపి, చంద్రబాబును రాష్ట్రంలో ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని డీహరినాధ్ ఆవేదన వ్యక్తం చేశారు 

మోడీ–అమెరికా వాణిజ్య ఒప్పందం కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, NEET పరీక్షల లీక్‌ పరిస్థితి వల్ల 26 లక్షల మంది విద్యార్థులు కష్టపడ్డారని తెలిపారు. అలాగే, కాక్రోచ్ జంతర్ మంతర్‌లో నిరుద్యోగ యువత, విద్యార్థులు చేపట్టిన నిరసన మోడీ పాలనపై ప్రజల అసంతృప్తిని సూచిస్తుందని డి హరినాథ్ గుర్తు చేశారు.

డీహరినాథ్ చివరగా హెచ్చరిస్తూ, “ప్రజల స్పందనకు మోడీ తన శ్రేణులను అప్రమత్తంగా వుంచకపోతే ఎదురుదెబ్బలు తప్పవు” అని హెచ్చరించారు