BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 01:49 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
11 Jun, 2026 - 01:49 PM
120 వీక్షణలు

తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని మనోజ్ నగర్ ప్రాంతం ప్రస్తుతం అక్రమ కట్టడాలకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, సరైన అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

నివాస ప్రాంతాల మధ్యలో వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస సెట్‌బ్యాక్‌లు పాటించకపోవడం, రహదారుల వెడల్పును పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అక్రమ నిర్మాణాల వెనుక స్థానిక ప్రభావశీలులు, రాజకీయ నేతల అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడం వెనుక కారణాలపై ప్రజల్లో చర్చ సాగుతోంది. విచారణ చేపడితే అసలు సూత్రధారులు బయటపడతారని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, తాడిగడపలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లేందుకు బాధితులు, సామాజిక కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. :::