BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 02:30 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
11 Jun, 2026 - 02:30 PM
85 వీక్షణలు

నటన... రాజకీయం..సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి

నటుడు, శాసనసభ్యులు బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాటి.

చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి నివాసం నందు తెలుగుయువత ఆధ్వర్యంలో నటులు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కేక్ కటింగ్ చేశారు. అనంతరం స్థానిక ఆర్యవైశ్య కల్యాణమండపంలో నిర్వహించిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం బాలయ్య అభిమానులు ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి, మజ్జిగ వితరణ చేశారు. 


ఒకే వ్యక్తి అన్ని రంగాల్లో రాణించడం చాలా అరుదుగా చూస్తుంటామని, మా అభిమాన నాయకుడు, సహచర శాసనసభ్యులు, సోదర సమానులు శ్రీ నందమూరి బాలకృష్ణ అలాంటి వారిలో ఒకరని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. నటన..రాజకీయం.. సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారని, ప్రజలతో పాటు...అభిమానుల వెలకట్టలేని అభిమానంతో ఆయన నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. 


కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, టీడీపీ నాయకులు తుబాటి శ్రీహరి, కుమీర్, టీడీపీ గట్టినేని సాయి, జాస్టి కిన్ను, కొత్త కోటేశ్వరరావు, మురకొండ మల్లిబాబు, చెవూరి కృష్ణమూర్తి, పిల్లి కోటేశ్వరరావు, తేలప్రోలు సాంబశివ, అమరా మణి కుమార్, కొల్లిశెట్టి రంగా, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.