BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 03 August 2026, 02:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ, చిత్తపూరులో రేపు మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 02:52 PM
160 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని చనుబండ, చిత్తపూరు గ్రామాల్లో రేపు 4వ తేదీ అనగా మంగళవారం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు చనుబండ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనానికి శంకుస్థాపన చేయడంతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చిత్తపూరు గ్రామంలో నిర్వహించే పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పాస్‌బుక్కులు అందజేస్తారు. ఆ తర్వాత ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలను కలుసుకోనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు కోరారు