BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 August 2026, 02:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 02:18 PM
426 వీక్షణలు

చనుబండ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా చనుబండ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము పాల్గొని మాట్లాడుతూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి స్ఫూర్తితో విద్యార్థుల ప్రోత్సాహానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

కొలుసు పెద్దరెడ్డి చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే గొప్ప కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచి, పోటీ తత్వాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రకటించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.5 వేలు, రెండవ బహుమతిగా రూ.4 వేలు, మూడవ బహుమతిగా రూ.3 వేలను అందజేశారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణంలో విద్యార్థుల సమక్షంలో నగదు బహుమతులను అందించారు.

అదేవిధంగా వచ్చే సంవత్సరం ఆగస్టు 15 నాటికి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆయా తరగతుల్లో 100 శాతం హాజరు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహక బహుమతి అందిస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు చీదిరాల మారేశ్వరరావు, బీజేపీ నాయకుడు నెక్కలపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.