BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 18 August 2026, 01:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డ్వాక్రా మహిళలకు ఊరట.. 10 మంది సభ్యులు లేకున్నా బ్యాంకు రుణాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:16 PM
63 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సంఘాల్లో సభ్యుల సంఖ్య తగ్గినా రుణాల మంజూరుకు అడ్డంకులు లేకుండా నిబంధనలను సడలించింది.

ఇకపై డ్వాక్రా సంఘంలో 10 మంది సభ్యులు లేకపోయినా కనీసం 8 మంది క్రియాశీల సభ్యులు ఉంటే పునరావృత రుణాలు పొందే అవకాశం కల్పించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా డ్వాక్రా సంఘాలకు ప్రయోజనం చేకూరనుంది.

స్త్రీనిధి పథకం ద్వారా అర్హత ఉన్న సంఘాలు సుమారు రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది. అయితే రుణం మంజూరైన ఆరు నెలల్లోపు సంఘ సభ్యుల సంఖ్యను తిరిగి 10 మందికి పెంచుకోవాల్సి ఉంటుంది.

రుణం పొందేందుకు సంఘ సమావేశం నిర్వహించి ప్రత్యేక తీర్మానం చేయాలి. అనంతరం సంబంధిత పత్రాలతో బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని అధికారులు తెలిపారు.