BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

8.50 కోట్లు ఖర్చు చేసినా దక్కని వైద్యం

తెలంగాణ
30 Dec, 2025 - 10:27 AM
277 వీక్షణలు

8.50 కోట్లు ఖర్చు చేసినా దక్కని వైద్యం

– కాంగ్రెస్ సర్కార్‌పై కొప్పుల ఫైర్ NTODAY NEWS: ధర్మపురి  ప్రారంభించిన ఆసుపత్రికి గ్రహణం… రెండేళ్లుగా ప్రజలకు అందని సేవలు ప్రజా ఆరోగ్యాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ధర్మపురి పట్టణ కేంద్రంలో దాదాపు రూ.8.50 కోట్లతో నిర్మించిన 50 పడకల మాతా–శిశు సంరక్షణ ఆసుపత్రిని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో పూర్తి చేసి ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో మంగళవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ధర్మపురి పట్టణ కేంద్రంలో సుమారు రూ.7 కోట్లతో నిర్మించిన 50 పడకల మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండేళ్లు గడిచినా ప్రజలకు అందుబాటులోకి తేనీయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్ర స్థాయిలో ఉండాల్సిన మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని, టెంపుల్ సిటీగా పేరున్న ధర్మపురి పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు, పిల్లలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనే ప్రత్యేక చొరవతో తీసుకువచ్చామని తెలిపారు. అనాడు మాజీ సీఎం కేసీఆర్ సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా మాతా–శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి ద్వారా ప్రసవ సేవలు మెరుగుపడ్డాయని చెప్పారు. ఈ కేంద్రాలు ప్రారంభమైన తరువాత శస్త్రచికిత్సలు తగ్గి, సహజ ప్రసవాలు పెరిగాయని, అలాగే ఆర్థికంగా కూడా మహిళలకు సహాయం అందిందని వివరించారు. తాను మంత్రి హోదాలో ఉన్న సమయంలోనే ఈ మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని రూ.7 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగిందని, రెండేళ్ల క్రితమే కేటీఆర్ చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు ఈ ఆసుపత్రిలో ఒక్క సేవ కూడా ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ, అవసరమైన డాక్టర్లు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇవి సమకూరిస్తే ధర్మపురి ప్రజలకు ప్రసూతి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ధర్మపురి ప్రజలు గెలిపించిన వ్యక్తి ప్రస్తుతం మంత్రి హోదాలో ఉండి, మొదట చీఫ్ విప్‌గా కూడా పనిచేశాడని, అధికారం చేతిలో ఉండి కూడా ఈ ఆసుపత్రిని ప్రజల అందుబాటులోకి తీసుకురాలేకపోవడమేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వద్ద అనేక సమీక్షలు చేశామని చెబుతున్నా, ఈ ఆసుపత్రి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ఈ ఆసుపత్రిని ప్రారంభించి ఉంటే వేలాది మంది మహిళలు, పిల్లలకు మేలు జరిగేదని పేర్కొన్నారు. ఆసుపత్రి చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచిపోయాయని, మంత్రి ఒక్కసారి కూడా వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవని విమర్శించారు. ధర్నా చేసిన తరువాతే స్పందించే పరిస్థితి రావద్దని, ముందే బాధ్యతగా వ్యవహరించి ఆసుపత్రిని ప్రారంభించాల్సిందని అన్నారు. రెండేళ్ల పాటు ఓపిక పట్టామని, అయినా స్పందన లేకపోవడంతోనే ఈ రోజు తీవ్ర నిరసనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. తక్షణమే ఈ మాతా–శిశు సంరక్షణ ఆసుపత్రిని ప్రజల అందుబాటులోకి తీసుకువచ్చి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సంగి సత్తెమ్మ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, బీఆర్‌ఎస్ పార్టీ కన్వీనర్ అయ్యోరి రాజేష్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube