BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 08 June 2026, 07:14 pm
Posted by : కూనురు మధు

ధాన్యం అమ్మి పది రోజులైనా రాని పైసలు.. చిట్యాల రైతుల ఆవేదన!

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Jun, 2026 - 07:14 PM
333 వీక్షణలు

ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పండించిన పంటను అమ్ముకున్నా  చేతికి పైసలు అందక అన్నదాతలు తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. గత నెల 29వ తేదీన వరి ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ట్రాక్ షీట్ ఆన్‌లైన్ చేయకపోవడంతో వందల మంది రైతులు డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీఏసీఎస్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని రైతులు మండిపడుతున్నారు. ధాన్యం అమ్మి పది రోజులు దాటుతున్నా మొబైల్ ఫోన్లకు రావాల్సిన ఓటీపీ  కాస్తా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మరోవైపు కొత్త పంట పెట్టుబడులకు సమయం ఆసన్నమవుతుండటంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. వరి కోసిన మిషన్ల వారికి, రవాణా చేసిన ట్రాక్టర్ల యజమానులకు బిల్లులు కట్టాలి. ఎరువుల షాపుల బాకీలు తీర్చాలి. ధాన్యం ఆరబోసిన కూలీలకు, పట్టాలు అద్దెకు ఇచ్చిన వారికి పైసలు ఇవ్వాలి అని . వీరందరికీ సమాధానం చెప్పలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతిలో పైసా లేక, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోయారు. పంట అమ్ముకున్నాక కూడా డబ్బుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సి రావడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెద్దకాపర్తి పీఏసీఎస్ సెంటర్ పరిధిలోని రైతుల సమస్యను ఉన్నతాధికారులు తక్షణమే పరిశీలించాలని, వెంటనే ట్రాక్ షీట్లను ఆన్‌లైన్ చేసి, వారి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.