BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 07:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం: డి. హరినాథ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jul, 2026 - 07:10 PM
121 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ పేర్కొన్నారు. విస్సన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, పెరుగుతున్న నిరుద్యోగం తదితర సమస్యలపై దేశవ్యాప్తంగా గాంధేయ మార్గంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను చైతన్యవంతం చేసిన ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం అణచివేతకు పాల్పడిందని ఆరోపించారు.

ప్రజా ఉద్యమాల ఒత్తిడితోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడిందని హరినాథ్ అన్నారు. ఒకవైపు చర్చలు జరుపుతూ, మరోవైపు నిరంకుశ చట్టాల ద్వారా విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారని విమర్శించారు. జంతర్ మంతర్ ఉద్యమం కేంద్ర పాలకుల్లో ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ కుంభకోణంపై ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరారు.

ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సోనం వాంగ్‌చుక్, ఐసా జాతీయ నాయకురాలు నేహా తదితరుల పోరాట స్ఫూర్తి అభినందనీయమని తెలిపారు. అలాగే ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాసంఘాలు, అభ్యుదయవాదులకు విప్లవ అభివందనాలు తెలియజేశారు.