BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 06:21 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు మెడికేటెడ్ దోమతెరల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 Nov, 2026 - 06:21 PM
13 వీక్షణలు

పుంగనూరు, అన్నమయ్య జిల్లా:

దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు తదితర వ్యాధుల నుంచి విద్యార్థులను రక్షించడంతో పాటు, వారిలో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మెడికేటెడ్ దోమతెరలను పంపిణీ చేశారు.

అన్నమయ్య జిల్లా వైద్యాధికారి, మలేరియా అధికారి సూచనల మేరకు పుంగనూరు పట్టణంలోని మేలుపట్ల వద్ద ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు వైద్య సిబ్బంది మెడికేటెడ్ దోమతెరలను అందజేశారు

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇంటి పరిసరాలు, వసతి గృహాల వద్ద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దోమకాటు ద్వారా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున రాత్రి వేళల్లో తప్పనిసరిగా దోమతెరలను ఉపయోగించాలని తెలిపారు. మెడికేటెడ్ దోమతెరల వినియోగం ద్వారా దోమల నుంచి రక్షణ పొందవచ్చని, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని వివరించారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో యూపీహెచ్‌సీ కొత్తపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్యకృష్ణ, సబ్ యూనిట్ అధికారి గంగయ్య, ప్రిన్సిపాల్ అన్నపూర్ణ, హెల్త్ అసిస్టెంట్లు తేజోమూర్తి, సోమశేఖర్ ఆచారి, ఏఎన్‌ఎంలు శ్రీలత, జ్యోతి, ఆశా కార్యకర్త భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.